ఐదుగురు లిఫ్టర్లు డోపీలు

Former Commonwealth Games Gold Medallist Weightlifter Ravi Kumar Banned For Four Years - Sakshi

జాబితాలో కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్‌ రవికుమార్‌

సాక్షి, భువనేశ్వర్‌: భారత వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోయారు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న ఐదుగురు డోపీల్లో కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్, ఒడిశాకు చెందిన కత్తుల రవికుమార్‌ ఉన్నాడు. 2010లో బంగారం నెగ్గిన రవి... 2014లో రజతం గెలిచాడు. అతనితో పాటు జూనియర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్‌ తోమర్‌ ఉన్నారు. జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో వీరంతా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో వీరిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. స్టార్‌ లిఫ్టర్‌ రవి ‘ఒస్టారిన్‌’ అనే ఉత్ప్రేరకం తీసుకున్నాడు. ఇది కండరాల శక్తిని పెంచేది.

విశాఖపట్నంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అతనికి నిర్వహించిన పరీక్షల్లో దొరికిపోవడం జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ వర్గాల్ని కలవరపరిచింది. అయితే ఈ డోపింగ్‌ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌) కార్యదర్శి సహదేవ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ‘నాడా’ భారత్‌కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) పరిగణిస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఐడబ్ల్యూఎఫ్‌ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్‌ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top