ఓటమిపై స్పందించిన హర్మన్‌

Harmanpreet Kaur Talks After Losing T20 World Cup Final - Sakshi

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్‌లో భారత్‌ ఓటమిపై టీం కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ స్పందించింది. మ్యాచ్‌ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో తమ జట్టు ఆటతీరుపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నానని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే టోర్నీఅంతా గొప్పగా రాణించి.. కీలకమైన ఫైనల్‌లో ఓడటం బాధకరమని పేర్కొంది. ‘ప్రస్తుతమున్న టీంపై ఎంతో నమ్మకముంది. రానున్న ఆరునెలల కాలం తమకు ఎంతో కీలకం. ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు విజయం సాధిస్తే.. మరికొన్ని సార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుంది. అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తూ ఫైనల్‌లో ఓడాం. భవిష్యత్తులో గొప్పగా రాణిస్తామన్న నమ్మకం నాకుంది’ అని వెల్లడించింది. కాగా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.(ఈసారి కూడా చాంపియన్‌ ఆస్ట్రేలియానే)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top