‘క్రికెట్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నా’

Harmanpreet Kaur wanted to take a break from international cricket - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది నవంబర్‌లో వెస్టిండీస్‌ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో స్టార్‌ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ను తప్పించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో తాను చాలా కలత చెందినట్లు భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపారు. ప్రధానంగా మిథాలీ రాజ్‌ను తప్పించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో పాటు బీసీసీఐ వివరణ కోరడం మనోవేదనకు గురి చేసిందన్నారు. ఆ సమయంలో క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలని భావించానన్నారు. తన బాధను తల్లి దండ్రులు కూడా అర్థం చేసుకుని క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారన్నారు.

అయితే తాను ఒక సీనియర్‌ క్రీడాకారిణి కావడంతో జట్టుకు దూరం కావడానికి ఆలోచించాల్సి వచ్చిందన్నారు. ‘నేను క్రికెట్‌ నుంచి దూరమవుదామనుకున్న సమయం అది. కాకపోతే జరిగిన విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేశా. వివాదాలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదనుకున్నారు. నేను ఇక్కడికి క్రికెట్‌ ఆడటానికి వచ్చిన విషయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. నన్ను ఎవరైనా అనవరసరమైన వివాదాల్లో లాగాలనే చూస్తే జట్టును కూడా ఇరుకున పెట్టడమే అని విషయం ప్రజలు తెలుసుకోవాలి. ఇకపై తనపై ఏమైనా వచ్చినా వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నా’ అని హర్మన్‌ తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top