కరోనా : ఆ టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇస్తా

Henry Nicholls Donates  2019 World Cup Final Shirt To Unicef - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌ క్రికెటర్‌ హెన్రీ నికోల్స్‌ 2019 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ధరించిన టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపాడు. కరోనా  మహమ్మారిని తరిమికొట్టేందుకు తన వంతుగా ఈ సాయం అందించి విరాళాలను సేకరించనున్నట్లు మీడియాతో వెల్లడించాడు. హెన్రీ నికోల్స్‌ మాట్లాడుతూ.. ' కరోనాను తరిమికొట్టేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నా. బాగా ఆలోచించి ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ధరించిన హాప్‌ స్లీవ్‌ టీషర్ట్‌పై మా టీమ్‌ సహచర ఆటగాళ్లతో సంతకం చేయించి యునిసెఫ్‌(యునైటెడ్‌ నేషనల్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఎమర్జెన్సీ ఫండ్‌)కు విరాళం ఇవ్వాలనుకున్నా.  ప్రజలు స్వచ్చందంగా తమ వంతుగా విరాళం ఇచ్చేలా ప్రోత్సహించేదుకే ఈ పని చేస్తున్నా.

దీనితో సంబంధం లేకుండా వచ్చే సోమవారం నాటికి ఎవరు పెద్ద మొత్తంలో విరాళం అందజేసిన వ్యక్తికి యునిసెఫ్‌ ద్వారా టీషర్ట్‌ లభిస్తుంది.‌ అయితే నేనే డైరెక్టుగా టీషర్ట్‌ను వేలం వేస్తే సరిపోయేది కదా అని మీరు అనుకోవచ్చు.. కానీ నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను విరాళం ఇచ్చేటప్పుడు నాకు మద్దతుగా ఎంతమంది స్వచ్చందంగా ముందుకు వస్తారో చూద్దామని భావించానంటూ' చెప్పుకొచ్చాడు. కాగా ఏప్రిల్‌ మొదటి వారంలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్ బట్లర్ ఇదే విధంగా తాను ప్రపంచకప్‌లో ధరించిన టీషర్ట్‌ను వేలం వేసి 65,100 పౌండ్ల విరాళం సేకరించాడు. ఈ మొత్తాన్ని లండన్‌లో కోవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్న రెండు ఆసుపత్రులకు అందజేశాడు.
(కరోనా లేదన్నా ఇంట్లోకి రానివ్వలేదు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top