రిచర్డ్స్‌పై ఇయాన్‌ స్మిత్ ప్రశంసలు

Ian Smith Praises On Viv Richards His Strike Rate - Sakshi

దిగ్గజ క్రికెటర్‌ సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌పై న్యూజిలాండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత సయయంలో ఐపీఎల్‌ వంటి టీ20 లీగ్‌ల్లో టీమ్‌ యజమానులు వివియన్‌ రిచర్డ్స్‌కు అధిక మొత్తంలో చెల్లించి తమ జట్టులోకి తీసుకోవాల్సి వచ్చేదని అన్నారు. ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌, న్యూజిలాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌లకు చెల్లించే దానికంటే అధిక మొత్తం చెల్లించాల్సి ఉండేదన్నారు. రిచర్డ్స్‌ ఏ ఫార్మాట్‌లోనైనా, ఏ దశాబ్దంలోనైనా గొప్పగా రాణించే ఆటగాడు అని తను నమ్ముతున్నానని తెలిపారు.

ఆ కాలంలోనే రిచర్డ్స్‌ స్ట్రైక్ రేట్‌ను ప్రతి ఒక్కరు గొప్పదిగా భావించారని తెలిపారు. ఐపీఎల్‌ వంటి టీ20 లీగులు లేని కాలంలో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు సమానమైన స్ట్రైక్ రేట్‌ను నెలకొల్పాడని కొనియాడారు. కాగా, క్రికెట్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లో వివియన్‌ రిచర్డ్స్‌ ఒకరు అన్న విషయం తెలిసిందే. 1990ల్లోనే రిచర్డ్స్ స్ట్రైక్ రేట్‌ 67.1 నమోదు చేశారు. ఇక, గతేడాది జరిగిన ఐపీఎల్ వేలం‌లో కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో అత్యంత విలువైన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ నిలిచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top