మార్చి 2న మైదానంలోకి ధోని

IPL 2020: CSK Captain Dhoni To Start Training From 2nd March - Sakshi

చెన్నై: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మార్చి 2న మైదానంలో అడుగుపెట్టనున్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ధోని తన ఆటను తిరిగి ప్రారంభించనున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13 కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) సన్నాహకాలను ప్రారంభించింది. ఇప్పటకే సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా, అంబటి రాయుడులతో పాటు మరికొంత మంది గత మూడు వారాలుగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ ఆటగాళ్లతో ధోని మార్చి 2న కలవనున్నాడు. రెండు వారాల కఠోర సాధన తర్వాత ధోని చిన్న విరామం తీసుకుంటాడు. అనంతరం అదే నెల 19 నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్‌ క్యాంప్‌లో పాల్గొంటాడని, ఈ రెగ్యులర్‌ క్యాంప్‌లో ఆటగాళ్లందరూ పాల్గొంటారని సీఎస్‌కే అధికారులు తెలిపారు. 
 
సీఎస్‌కే ఆటగాళ్ల ప్రాక్టీస్‌ సెషన్‌కు చిదంబరం స్టేడియానికి అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతారనే విషయం తెలిసిందే. వేలాది అభిమానుల సమక్షంలో ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తూ వారిని అలరిస్టుంటారు. ఇక రానున్న ఐపీఎల్‌ సీజన్‌ ధోని ఎంతో కీలకమైంది. ఈ టోర్నీలో సత్తా చాటి తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు... అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ సారి టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఇప్పటివరకు మూడు సార్లు చాంపియన్‌, ఐదు సార్లు రన్నర్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ సారి జట్టులో పలు కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా వేలంలో పీయుష్‌ చావ్లా, హాజిల్‌వుడ్‌, స్యామ్‌ కరన్‌, సాయి కిశోర్‌లను సీఎస్‌కే ఎంచుకుంది. ప్రాక్టీస్‌ సెషన్స్‌ ఎక్కువగా నిర్వహించడంతో కొత్త, పాత ఆటగాళ్ల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుందని సీఎస్‌కే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, మార్చి 29న ముంబై వేదికగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. 

చదవండి:
‘అప్పుడు ధోని ఏం చెప్పాడంటే?’
రోహిత్‌ కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top