ఐపీఎల్‌లో ఆ పోరు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను తలపించేలా

IPL: Harbhajan Interesting Comments During Interview With CSK - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య జరిగే ప్రతీ మ్యాచ్‌ భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పోరుగా భావించేవాడినని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్ ‌సింగ్‌ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ముంబై ఇండియన్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహించిన భజ్జీ గత రెండు సీజన్లుగా సీఎస్‌కే తరుపున ఆడుతున్నాడు. సీఎస్‌కే నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న హర్భజన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘పదేళ్లుగా బ్లూ జెర్సీ ధరించి.. ఆ తర్వాత వెంటనే సీఎస్‌కే జెర్సీ ధరించేటప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇది కలనా? నిజమా? అని నాకు నేను ప్రశ్నించుకునే వాడిని. సీఎస్‌కేతో ఆడినప్పుడల్లా భారత్‌-పాక్‌ పోరుగా భావించేవాడిని. అలాంటిది అకస్మాత్తుగా సీఎస్‌కే తరుపున ఆడటం కష్టంగా అనిపించింది. నా తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌తోనే తలపడాల్సి రావడం అదృష్టంగానే భావించాను. ఎందుకంటే సీఎస్‌కేకు త్వరగా అలవాటు పడిపోయాను. అయితే అప్పుడు ఒకటి అర్థమైంది. త్వరగా అలవాటు పడటం చాలా కష్టం’అని భజ్జీ పేర్కొన్నాడు. ఇక సీఎస్‌కే, ముంబై జట్లలో నీకు ఫేవరెట్‌ జట్టు ఏదని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. కాస్త ఇబ్బందిపడిన భజ్జీ తనకు ముంబై జట్టే ఇష్టమని తేల్చిచెప్పాడు.   

చదవండి:
‘ధోనికి చాలా సిగ్గు.. ఆ తర్వాతే మారాడు’
నా గుండె వేగం అమాంతం పెరిగేది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top