చాంప్‌ కర్ణాటక

Karnataka Beat Tamil Nadu By 1 Run In A Thrilling Final - Sakshi

ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ సొంతం

ఫైనల్లో పరుగు తేడాతో తమిళనాడుపై గెలుపు

కెప్టెన్‌ మనీశ్‌ పాండేకు పెళ్లి కానుక

సూరత్‌: చివరి ఓవర్లో 13 పరుగులు... డిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటకను ఓడించి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని అందుకునేందుకు తమిళనాడు ముందున్న విజయ సమీకరణం. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన తొలి రెండు బంతుల్లోనే రెండు ఫోర్లు బాది అశ్విన్ సమీకరణాన్ని సులువుగా మార్చాడు. అయితే తర్వాతి రెండు బంతులకు ఒకే పరుగు వచి్చంది. ఐదో బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో విజయ్‌ శంకర్‌ రనౌటయ్యాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా సింగిల్‌ మాత్రమే రావడంతో కర్ణాటక విజయం ఖాయమైంది. నేడు పెళ్లి చేసుకోబోతున్న తమ కెప్టెన్‌ మనీశ్‌ పాండేకు జట్టు చక్కటి బహుమతిని అందించింది.

ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో కర్ణాటక ఒక పరుగు తేడాతో తమిళనాడును ఓడించింది. ముందుగా  కర్ణాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (45 బంతుల్లో 60 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఆర్పీ కదమ్‌ (28 బంతుల్లో 35; 5 ఫోర్లు), దేవదత్‌ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం తమిళనాడు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. బాబా అపరాజిత్‌ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు), విజయ్‌ శంకర్‌ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు) పోరాడినా లాభం లేకపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top