రోహిత్‌ కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌!

Rohit with New Social Media Manager Shares Mumbai Indians - Sakshi

టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ విశ్రాంతి సమయంలో సతీమణి రితిక, కుమార్తె సమైరాలతో కలిసి రోహిత్‌ సరదాగా గడుపుతున్నాడు. సమైరాతో కలిసి అతడు దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోన్‌లో తన కూతురికి రోహిత్‌ ఏదో చూపిస్తున్నాడు. అయితే సమైరా కూడా ఎంతో ఆసక్తిగా తండ్రి చూపించిన అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆ ఫోటోలో ప్రతిబింబిస్తుంది. ఈ ఫోటోను ముంబై ఇండియన్స్‌ ఫన్నీగా రూపొందించి తిరిగి రీపోస్ట్‌ చేసింది. ‘రోహిత్‌ కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌.. ఎంత క్యూట్‌గా ఉంది. అమెకు ఒకటి నుంచి పది వరకు ఎన్ని పాయింట్లు ఇస్తారు’అంటూ ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌కు పదికి పది పాయింట్లు ఇస్తామంటూ రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫన్నీగా పేర్కొంటున్నారు. 

ఇక రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈ సారి బరిలోకి దిగుతున్న రోహిత్‌ సారథ్యంలోని ముంబై జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్‌ మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో రీఎంట్రీ  ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక తాజాగా కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. రోహిత్‌ జట్టులో ఉంటే వన్డే సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురికాకుండా ఉండేదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి:
ధోని ప్రాక్టీస్‌కు రంగం సిద్ధం!
కోహ్లి వికెట్‌ తీస్తేనే మజా

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top