‘న్యూజిలాండ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా రాస్‌ టేలర్‌

Ross Taylor Got The Cricketer Of The Year Award For New Zealand - Sakshi

వెల్లింగ్టన్‌: ప్రతిష్టాత్మక ‘న్యూజిలాండ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ ఎంపికయ్యాడు. జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్‌లలోనూ విశేషంగా రాణించిన టేలర్‌ శుక్రవారం ‘సర్‌ రిచర్డ్‌ హాడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల టేలర్‌ ఈ అవార్డును అందుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. గత సీజన్‌లో అద్భుతంగా ఆడిన టేలర్‌ అన్ని ఫార్మాట్‌లలో కలిపి 1389 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (7238) చేసిన ఆటగాడిగా నిలిచిన టేలర్‌... మూడు ఫార్మాట్‌లలో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.  ఈ సందర్భంగా టేలర్‌ మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల తర్వాత ఈ స్థాయికి చేరుకున్నానని అన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top