సఫారీ అమ్మాయిల చరిత్ర

South Africa register maiden T20 World Cup win against England - Sakshi

టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఇంగ్లండ్‌పై గెలుపు

పెర్త్‌: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మహిళలు చరిత్రకెక్కే విజయాన్ని సాధించారు. తొలిసారి ఇంగ్లండ్‌లాంటి మేటి జట్టుపై గెలుపొందారు. మహిళల టి20 మెగా ఈవెంట్‌లో సఫారీ జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. ఆదివారం ఉత్కంఠ రేపిన ఈ  పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. సీవర్‌ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించింది. ఓపెనర్‌ జోన్స్‌ (20 బంతుల్లో 23; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది.

సఫారీ బౌలర్లు అయబొంగ (3/25), వాన్‌ నికెర్క్‌ (2/20), మరిజనె (2/19) సమష్టిగా దెబ్బతీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్, కెప్టెన్‌ వాన్‌ నికెర్క్‌ (51 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరిజనె (33 బంతుల్లో 38; 6 ఫోర్లు) రాణించారు. ఇంగ్లిష్‌ బౌలర్‌ ఎకిల్‌స్టోన్‌ 2 వికెట్లు తీసింది. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రంట్‌ వేసిన ఆ ఓవర్‌లోని 3, 4 బంతుల్ని డు ప్రీజ్‌ వరుసగా 6, 4 బాదడంతో 2 బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top