చీఫ్‌ సెలక్టర్‌గా సునీల్‌ జోషి

Sunil Joshi Named As New BCCI Chief Selector - Sakshi

సాక్షి, ముంబై: బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ సునీల్‌ జోషీ నియమితులయ్యారు. మదన్‌ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సునీల్‌ జోషి పేరును బీసీసీఐకి సిఫార్సు చేసింది. బుధవారం సమావేశమైన సీఏసీ సెలక్టర్‌ పదవికి దరఖాస్తులు చేసుకున్న వారిని తుది ఇంటర్వ్యూలు చేసింది. వెంకటేశ్‌ ప్రసాద్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడినప్పటికీ సునీల్‌ వైపే సీఏసీ మొగ్గు చూపడంతో అతడికే చీఫ్‌ సెలక్టర్‌ పదవి వరించింది. సెలక్షన్‌ కమిటీ సభ్యుడిగా మాజీ పేసర్‌ హర్విందర్‌ సింగ్‌కు సీఏసీ అవకాశం కల్పించింది. స్వదేశంలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం ఈ నూతన ఛైర్మన్‌ ఆధ్వర్యంలోని కమిటీనే టీమిండియాను ఎంపిక చేయనుంది.  

బుధవారం చీఫ్‌ సెల​క్టర్‌ను ఎంపిక నేపథ్యంలో సీఏసీ మంగళవారమే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షాలను కలిసి మార్గదర్శకాలను తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మరోసారి భేటీ అయిన సీఏసీ అజిత్‌ అగార్కర్‌ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో కర్ణాటక మాజీ ప్లేయర్స్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌, సునీల్‌ జోషీలపై పోటీ ఏర్పడింది. చివరికి సునీల్‌ జోషీనే సీఏసీ ఎంపిక చేసింది. ఇక సునీల్‌ 1996-2001 మధ్య కాలంలో టీమిండియా తరుపున ప్రాతినిథ్య వహించాడు. 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. 

చదవండి:
అజిత్‌ అగార్కర్‌కు నిరాశ
'కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top