‘దొంగ నిల్వలు పెట్టుకోవద్దు’

Time To Be Human, Not Hindu, Muslim, Shoaib Akhtar - Sakshi

మానవత్వాన్ని చూపే సమయం

కరోనాపై కుల-మతాలకు అతీతంగా పోరాడుదాం

కరాచీ:  కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గమని పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సూచించాడు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో పడిపోయిన సమయంలో ఒకరికోసం ఒకరు నిలబడాలంటూ పేర్కొన్నాడు. ఇక్కడ దొంగ నిల్వలు అనేవి పెట్టుకోవద్దని అక్తర్‌ విజ్ఞప్తి చేశాడు. మనం నిత్యావసరాలను దొంగ నిల్వలుగా పెట్టుకునే సమయంలో రోజు వారీ శ్రామికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు.  ఇప్పుడు ప్రతీ స్టోర్‌ ఖాళీగానే కనుబడటం లేదా మూసి వేయడమే జరుగుతూ ఉందని, ఇది మూడు నెలల తర్వాతైనా అదుపులోకి వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదన్నాడు.(ఇది భరించలేని చెత్త వైరస్‌)

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నవాళ్లు లేనివాళ్లకు సాయం చేయడం ఒక్కటే మార్గమన్నాడు. ఏ రోజుకు ఆరోజు బ్రతికే వారి గురించి అంతా ఆలోచించాలన్నాడు. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా ఉండకూడదన్నాడు. మనిషి మనిషిలాగా ఉండి కనీసం తమ వంతు సాయం చేయాలని పేర్కొన్నాడు. ‘ ఆర్థిక పరిస్థితి బాగున్నవారు నేటికి పెద్దగా సమస్యను ఏమీ చూడటం లేదు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నది పేద ప్రజలు మాత్రమే. నమ్మకం ఉంచడం. మనం మనుషుల్లా బ్రతుకుదామా.. లేక జంతువుల్లా ఉందామా. కనీసం తినడానికి తిండి లేనివాడికి సాయం చేయడానికి ప్రయత్నించండి. నిల్వలు పెట్టుకునే మాటే వద్దు. ఒకరికోసం ఒకరు అన్నట్లే ఉండాలి. అవతలి వాడి గురించి మనకెందుకు అనే ధోరణి వద్దు. మనుషులగా ఉందా.. తోటి వారిని రక్షించుకుందా’ అని అక్తర్‌ తెలిపాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top