నువ్వు మనిషి కాదు.. రాక్షసుడివి..!

Tyson Fury Tastes Deontay Wilder's Blood After Clinch WBC Title - Sakshi

లాస్‌ వేగాస్‌: ప్రపంచ బాక్సింగ్‌ కౌన్సిల్‌(డబ్యూబీసీ) హెవీ వెయిట్ ఛాంపియన్‌షిష్‌లో విజేతగా నిలిచిన తర్వాత బ్రిటన్‌ బాక్సర్‌ టైసన్ ఫ్యూరీ రీ చేసిన ఓ పనికి ఎంజీఎం గ్రాండ్‌ గార్డెన్‌ ఎరీనాలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో అమెరికా చాంపియన్‌ బాక్సర్‌ డియోంటి వైల్డర్‌పై విజయం సాధించిన ఫ్యూరీ ప్రత్యర్థిని కౌగిలించుకొని అతని నుంచి కారుతున్న రక్తాన్ని నాకడం ఒళ్లు జలదరించేలా చేసింది. ఇరువురి మధ్య ఏడో రౌండ్‌ వరకూ హోరీ హోరీ పోరు జరగ్గా, ఫ్యూరీ పైచేయి సాధించాడు. వైల్డర్‌కు తన పంచ్‌ల పవర్‌తో చుక్కలు చూపించాడు. తన ప్రొఫెషనల్‌ కెరీర్‌లోనే ఓటమి లేని వైల్డర్‌పై కసిదీరా పంచ్‌లు విసిరాడు. ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలనే కసితో రింగ్‌లో పదునైన పంచ్‌లను రుచి చూపించాడు. 

ఈ క్రమంలోనే వైల్డర్‌ చెవికి, నోటికి గాయం కావడంతో రక్తం వచ్చింది. బౌట్‌ జరిగిన తీరు కొందర్నీ ఆశ్చర్య పరిస్తే, ‘జిప్సీకింగ్‌‌’గా పలువబడే అతను తన ప్రత్యర్థి రక్తాన్ని నాకడాన్నే అందరూ ఆశ్చర్యంగా గమనించారు. అయితే ఫ్యూరీ రక్తాన్ని నాకుతున్న ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘ఇతను మనిషి కాదు రాక్షసుడు’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top