డబ్ల్యూడబ్ల్యూఈకు ది అండర్టేకర్‌ గుడ్‌బై

The Undertaker Retired From WWE - Sakshi

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు(డబ్ల్యూడబ్ల్యూఈ) ప్రఖ్యాత రెజ్లర్‌ ది అండర్టేకర్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. దాదాపు 30 ఏళ్లుగా రెజ్లింగ్‌లో ఫీల్డ్‌లో ఉన్న అండర్టేకర్‌.. ది లాస్ట్‌ రైడ్‌ డాక్యూ సిరీస్‌ చివరి ఎపిసోడ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నాకు మరోసారి రెజ్లింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టాలనే కోరిక లేదు. నేను గెలవడానికి ఏమి లేదు. నేను సాధించేది కూడా ఏమి లేదు. ప్రస్తుతం ఆట మారింది. ఇది కొత్తవారు రావడానికి సరైన సమయం. ఈ డాక్యూమెంటరీ నాకు చాలా సాయం చేసిందని భావిస్తున్నాను. ఇది ఒక రకంగా నా కళ్లు తెరిపించింద’ని పేర్కొన్నారు.(చదవండి : ‘ద్రవిడ్‌ కెప్టెన్సీకి క్రెడిట్‌ దక్కలేదు’)

ఇదే విషయాన్ని అండర్టేకర్‌ ట్విటర్‌ ద్వారా కూడా వెల్లడించారు. రెజ్లింగ్‌లో తన ప్రయాణం ముగిసిందని పేర్కొన్నారు. ఇక మిగిలిన జీవితంలో తన శ్రమకు దక్కిన ఫలాలను అస్వాదించనున్నట్టు తెలిపారు. మరోవైపు అండర్టేకర్‌ రిటైర్‌మెంట్‌పై డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌ సోషల్‌ మీడియాలో పలు పోస్ట్‌లు చేసింది. అండర్టేకర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేసింది. కాగా, అండర్టేకర్‌ తన చివరి మ్యాచ్‌లో ఏజే స్టైల్స్‌తో తలపడ్డారు. వాస్తవానికి అండర్టేకర్‌ అసలు పేరు మార్క్ కాలవే.(చదవండి : దిమిత్రోవ్‌కు కరోనా.. జొకోవిచ్‌లో ఆందోళన)

థాంక్యూ టేకర్‌..
అండర్టేకర్‌ రిటైర్‌మెంట్‌పై ముంబై ఇండియన్స్‌ జట్టు స్పందించింది. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌ హేవీ వెయిట్‌ చాంపియన్‌షిప్‌ బెల్ట్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 30 అద్భుతమైన సంవత్సరాలు పేర్కొన్న ముంబై ఇండియన్స్‌.. థాంక్యూ టేకర్‌ అని పేర్కొంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top