ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

Virat Kohli Tweet About CWC19 Final - Sakshi

న్యూఢిల్లీ : క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయిన ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి స్పందించాడు. ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చిన ఈ మ్యాచ్‌ ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. కోహ్లి మాత్రం నిబంధనల జోలికి పోకుండా ఇరు జట్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్‌ చేశాడు. ‘ప్రపంచకప్‌ ఫైనల్లో ఇరు జట్లు అద్బుత పోరాటాన్ని కనబర్చాయి. ఇంగ్లండ్‌ జట్టుకు అభినందనలు’ అంటూ సాధాసీధాగా ట్వీట్‌ చేశాడు.

ఈ ఫైనల్‌ మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ రెండూ టై కావడంతో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌండరీల నిబంధనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, గంభీర్‌లు ఈ నిబంధనను తప్పుబట్టగా.. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ తరహా నిబంధనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top