కారులో మద్యం బాటిల్స్‌ పట్టుకున్న కలెక్టర్‌

Adilabad Collector Devasena Caught Illegal Liquor In Car During Lockdown - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : పట్టణ ప్రజలను కరోనా వైరస్‌ భయాందోళనలకు గురిచేస్తోంది. జిల్లాలో ఇప్పటికే  11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. అందులో ఆదిలాబాద్ పట్టణంలోనే ఏడుగురికి కరోనా సోకడంతో రెడ్ జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలో ఆంక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన స్వయంగా గల్లీ గల్లీ తిరుగుతూ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ లోని వినాయక్ చౌక్లో కలెక్టర్ పర్యటించి వాహనాలు తనిఖీ పర్యవేక్షించారు. ఈ తనిఖీల్లో భాగంగా తలమాడుగు మండలంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ గా పనిచేస్తున్న భీమన్న వాహనంలో పోలీసులు మద్యం సీసాలు గుర్తించారు. లాక్‌డౌన్ సందర్భంగా మద్యం షాపులు బంద్ కొనసాగుతున్న తరుణంలో 8 క్వార్టర్‌ బాటిల్స్‌ తో దొరకడంతో భీమన్న కారును పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top