పెళ్లిళ్ల పంచాంగం వాయిదా వేసుకోండి

ఉమ్మడి జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు ఆనంద్‌శర్మ
జోగుళాంబ శక్తిపీఠం: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అర్చక, పురోహితులంతా పెళ్లిళ్ల పంచాంగ శ్రవణం కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు, జోగుళాంబ ఆలయ ముఖ్య అర్చకులు దిండిగల్ ఆనంద్ శర్మ పిలుపునిచ్చారు. ప్రభుత్వం సూచనల మేరకు సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. ఉగాదిరోజు మాత్రం ఆలయాల్లో అర్చకుడు ఒక్కరు మాత్రమే ఊరంతా వినిపించేలా మైక్ పెట్టుకుని పంచాంగ శ్రవణం చేయాలని సూ చించారు. పంచాంగ శ్రవ ణంలో భక్తులను ఎవరినీ ఆహ్వానించరాదని పేర్కొ న్నారు. ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖలో పని చేసే అర్చకులు కూడా ఈ విధానం వర్తిస్తుందన్నారు. ఆయన వెంట దూపదీప నైవేద్య అర్చక సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు నరేంద్రచార్యులు ఉన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి