పరుగో పరుగు..

Army Recruitment Rally in Karimnagar 2019 - Sakshi

సాక్షి, కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఆర్మీ రిక్రూట్‌మెంటు ర్యాలీ ప్రారంభమైంది. తొలి రోజు పలు జిల్లాల అభ్యర్థులకు సోల్జర్‌ టెక్నికల్‌ విభాగంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి మూడు వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

కలెక్టరేట్‌ ఆవరణలోని హెలిప్యాడ్‌ప్రాంగణంలో ఎత్తు కొలిచి పంపించారు. 2,608 మంది రన్‌కు అర్హత సాధించారు. అంబేద్కర్‌ స్టేడియంలో 250 చొప్పున బ్యాచ్‌లుగా విభజించి రన్‌ నిర్వహించారు. వీరిలో సుమారు 250 మంది అర్హత సాధించినట్లు సమాచారం. జిల్లాలో వర్షం పడటంతో అంబేద్కర్‌ స్టేడియం ట్రాక్‌ బురద మయంగా మారింది. బురుదలోనూ పరుగు పందెం నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top