కొత్త కారు దగ్ధం; రూ. లక్ష బుగ్గిపాలు

సాక్షి, ఆదిలాబాద్ : కొత్తగా కొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండ మండలం మామడ టోల్ గేట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కారులో మంటలు రావడంతో... అందులో ప్రయాణిస్తున్నవారు అప్రమత్తమై కారులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. అయితే కారులో ఉన్న లక్ష రూపాయలు బుగ్గిపాలయ్యాయి. అయితే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. కాగా ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి