తెలంగాణలో 45కు చేరిన కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కరోనా కేసు నమోదయింది. సికింద్రాబాద్ బౌద్ద నగర్‌లోని 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. బౌద్ద నగర్‌లోని ఆ వ్యక్తికి సంబంధించిన వారితో పాటు అతను ఎవరెవరిని కలిశాడో వంటి వివరాలను పోలీసులు, వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారందరికి కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం నమోదయిన ఈ కేసుతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 45కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా సాగుతోంది. ప్రజానీకాన్ని బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి