కొనసాగుతున్న కరోనా కల్లోలం

Coronavirus Positive Cases Super Spread in GHMC And Rangareddy - Sakshi

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కల్లోలంకొనసాగుతోంది. అన్ని ప్రాంతాలకూ మహమ్మారి ప్రబలుతుండటంపై సర్వత్రాఆందోళన నెలకొంది. రికార్డు స్థాయిలోకోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నిర్ధారణఅవుతుండటం.. మరణాలూ సంభవిస్తుండటంతో నగరవాసులకు కంటిమీద కనుకు లేకుండా పోయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం ఒక్కరోజే 1422 కోవిడ్‌పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారు.రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌ జిల్లాలో94 కరోనా కేసులు నమోదయ్యాయి.  

ఎల్‌బీనగర్‌: హయత్‌నగర్, ఎల్‌బీనగర్, సరూర్‌నగర్‌ మూడు సర్కిళ్ల పరి«ధిలో మంగళవారం రికార్డు స్థాయిలో 80 కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 20, ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ పరిధిలో 22, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 38 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఒక్క రోజు 80 కేసులు నమోదు కావటంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో మున్సిపల్‌ అధికారులు శానిటైజేషన్‌ చేసి తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఉప్పల్‌ పీహెచ్‌సీ పరిధిలో...
ఉప్పల్‌: ఉప్పల్‌ పీహెచ్‌సీ పరిధిలో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్‌ డివిజన్‌ శాంతినగర్, విజయపురి కాలనీ, బీరప్పగడ్డ, రామంతాపూర్‌ డివిజన్‌లోని మధురానగర్, వెంకట్‌రెడ్డినగర్, గణేశ్‌నగర్, ఇందిరానగర్, హబ్సిగూడలలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో...
ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో 13 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ముషీరాబాద్‌ డివిజన్‌లోని మొరంబొందకులో మహిళ (30), చిన్నారి(9), ముషీరాబాద్‌లో మహిళ(37)లకు కరోనా సోకింది. చిక్కడపల్లిలోని వివేక్‌నగర్‌లో వ్యక్తి(47), విద్యానగర్‌లో యువకుడు (22), ముషీరాబాద్‌ గంగపుత్ర కాలనీలో యువకుడు (25) విద్యానగర్‌లో మహిళ(55), ముషీరాబాద్‌లోని జమిస్తాన్‌పూర్‌కు చెందిన వృద్ధురాలు (66) కోవిడ్‌ బారిన పడ్డారు. దోమలగూడలోని నల్లపోచమ్మ దేవాలయానికి సమీపంలోని యువతి(24), గాంధీనగర్‌లోని బచ్‌పన్‌ స్కూల్‌ ఎదురుగా నివసించే ఓ వ్యక్తి(59), విద్యానగర్‌లోని రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే మహిళ(33), విద్యానగర్‌లోని టీఆర్‌టీ క్వార్టర్స్‌కు చెందిన వ్యక్తి(33), రాంనగర్‌లోని బాలాజీనగర్‌లో ఓ మహిళ(36)లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–15 ఏఎంవోహెచ్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు.

శేరిలింగంపల్లి మండల పరిధిలో...
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రాంరెడ్డి తెలిపారు. కొండాపూర్‌లో 4, మియాపూర్‌లో 3, హైటెక్‌ సిటీ, లింగంపల్లి, గచ్చిబౌలిలలో ఒక్కో కేసు నమోదైందన్నారు.

మల్కాజిగిరిలో...
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో పది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హనుమాన్‌పేట్‌కు చెందిన వ్యక్తి(55), సఫిల్‌గూడలో యువతి(21), విమలాదేవినగర్‌లో వ్యక్తి(49), మౌలాలి వి.ఎన్‌.కాలనీలో వ్యక్తి(44), అంబేడ్కర్‌ నగర్‌లో మహిళ, ఓల్డ్‌ మల్కాజిగిరికి చెందిన ఓ వ్యక్తికి, పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళ(49), ఆనంద్‌బాగ్‌కు చెందిన యువకుడు (31), బాలసరస్వతీనగర్‌ చెందిన యువతి(27), యాదవనగర్‌ కు చెందిన వ్యక్తి(49), కాకతీయనగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి(53), సత్తిరెడ్డినగర్‌కు చెందిన వ్యక్తి(59)కి కోవిడ్‌ నిర్ధారణ అయింది.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో...
దుండిగల్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో పది కరోనా కేసులు నమోదయ్యాయి. షాపూర్‌నగర్‌కు చెందిన బాలిక(07), ప్రశాంత్‌నగర్‌కు చెందిన యువకుడు (20), జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (13), వ్యక్తి (43), యువకుడు (21), చింతల్‌కు చెందిన వ్యక్తి(51), మహిళ (45), గణేశ్‌నగర్‌కు చెందిన వ్యక్తి (40), సుభాష్‌నగర్‌కు చెందిన మహిళ (32 లకు కరోనా సోకింది.

బోడుప్పల్‌లో...
బోడుప్పల్‌: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శివపురి కాలనీలో ఓ వ్యక్తి (52), హేమానగర్‌లో మరో వ్యక్తి (51), న్యూహేమానగర్‌లో వ్యక్తి (40), రాజలింగం కాలనీలో వ్యక్తి (57), బోడుప్పల్‌లో ఓ వ్యక్తి (52)కి కరోనా పాజిటివ్‌ రాగా హోం క్వారెంటైన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

కాప్రా సర్కిల్‌ పరిధిలో...
కాప్రా: కాప్రా సర్కిల్‌ రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. చిన్న చర్లపల్లిలో ఓ వ్యక్తి(58)కి, నాచారం ఎర్రకుంటలో ఓ వ్యక్తి (24)కు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్నారు.

అడ్డుగుట్ట బి సెక్షన్‌లో...
అడ్డగుట్ట: అడ్డుగుట్ట డివిజన్‌ బి సెక్షన్‌ పరిధిలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. బి సెక్షన్‌లోని వేర్వేరు బస్తీలకు చెందిన ఓ మహిళ(28), ఓ వ్యక్తి(36)కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారిని హోం క్వారంటైన్‌ చేసి ఇంట్లోనే చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌లో...
బహదూర్‌పురా: కిషన్‌బాగ్‌ డివిజన్‌లోని అసద్‌బాబానగర్‌లోని ఓ వ్యక్తి(48)కి కరోనా నిర్ధారణ అయ్యిందని నోడల్‌ అధికారి బాలకృష్ణ తెలిపారు. ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేనందున హోమ్‌ క్వారంటైన్‌ చేశామన్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top