వెయ్యి వెంటిలేటర్లు ఇవ్వండి: ఈటల

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వెయ్యి వెంటిలేటర్లు కావాలని ఇప్పటికే కోరామని, ఇంకా రాలేదని, వాటిని తక్షణమే అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినికుమార్ చౌబేతో ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్‌లో కొత్తగా 1,500 పడకల టిమ్స్ ఆస్పత్రి ప్రారంభమైనందున వెంటిలేటర్ల అవసరముందని ఆయన వివరించారు. పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లను హెచ్‌సీఎల్ నుంచి అందిస్తామని కేంద్రం తెలిపిందని, కానీ తగినంత రావడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లను పెద్ద ఎత్తున సేకరిస్తుందని, కానీ ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందని చెప్పారు. అదే కేంద్రం అందిస్తే రాష్ట్రంపై భారం తగ్గుతుందని ఈటల వివరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి