ఇంటి నిర్మాణం పూర్తికాగానే వసూలుకు చర్యలు

ఆక్యుపెన్సీతో పాటే ఆస్తిపన్ను కూడా..
టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగం అనుసంధానం 15 నుంచి అమల్లోకి..
జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఆదాయం పెంపునకు కమిషనర్ లోకేష్‌కుమార్ చర్యలు ప్రారంభించారు. ఇకపై ప్రతి ఇంటి నిర్మాణదారుడి నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణం పూర్తికాగానే ఆటోమేటిక్‌గా అసెస్‌మెంట్‌తో పాటు ఆస్తిపన్ను చెల్లించాల్సిందిగా సదరు యజమానికి డిమాండ్ నోటీసు కూడా అందించనున్నారు. ఇందుకోసం టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలను అనుసంధానం చేయనున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి