వరదలో చిక్కుకున్న 40 మంది కూలీలు

సాక్షి, ములుగు: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు వరదలతో ఉప్పొంగుతున్నాయి. బుధవారం జిల్లాలోని మండపేట మండలంలో తిమ్మాపూర్ వద్ద ముసలమ్మ వాగు వరద నీటితో ఉదృతంగా పారుతోంది. కూలీ పనులకు వెళ్లిన 40 మంది వాగు దాటుతూ.. వారదలో చిక్కుకొని ఆరు గంటలపాటు వరద నీటిలో నరకయాతన అనుభవించారు. దీంతో తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనతో మండలంలో ఆందోళన వాతావరణం నెలకొంది. కాగా సమాచారం అందుకున్న పిసా చట్టం కోఆర్డినేటర్, స్థానిక గ్రామస్తులు బాధితులను రక్షించేందుకు సాహసం చేసి తాళ్ల సాయంతో వాగును దాటించారు. దీంతో వరద నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డ కూలీలు ఊపిరి పిల్చుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి