బండారు దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత

సాక్షి, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం గురించి అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత మాట్లాడుతూ.. దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్‌రావు ఆయనకు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రొటీన్ చెక్అప్లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. వైద్యపరీక్షల అనంతరం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆ తర్వాత సాయంత్రం బండారు దత్తాత్రేయ సిమ్లాకు బయలుదేరుతారు. (హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి