పరువు నష్టం దావా: కోర్టుకు రాని పేర్వారం రాములు

Inspector Madavareddy Defamation Suit On Farmer DGP Pervaram Ramulu - Sakshi

హైదరాబాద్ : తెలంగాణ మాజీ డీజీపీ పేర్వారం రాములుపై మాజీ ఇన్‌స్పెక్టర్‌ మాధవరెడ్డి సిటీ సివిల్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాధవరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి  పీడీయాక్ట్‌  పెట్టి జైలుకు పంపిన నేపథ్యంలో రాములుపై పరువునష్టం దావా వేశారు. బుధవారం రాములును విచారణకు హాజరు కావల్సిందిగా కోర్టు ఆదేశించింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని 2017లో రాములును కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, రాములు ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా మాజీ డీజీపీ రాములును అరెస్ట్ చేయాలని పిటీషనర్ మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ పేర్వారం రాములు 75 ఏళ్ల వయస్సుతో ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేదని.. రాములు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఇరు వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఈ కేసుపై తుది తీర్పును జూలై 5వ తేదీకి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top