‘పబ్లిసిటీ మీద ఉన్న చిత్తశుద్ధి నిర్మాణ పనుల మీద లేదు’

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, జగిత్యాల: యాభై రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఇంతవరకు ఒక్క బొట్టు కూడా వినియోగంలోకి రాలేదని మండిపడ్డారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తి పోసే ప్రాజెక్టు కలిగి ఉండటంతో సుమారు వంద టీఎంసీల నీరు వృధాగా పోతుందన్నారు. ఇప్పటి వరకు కేవలం 16 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రానికి విద్యుత్ భారం అవుతుందన్నారు. రొల్లవాగు ఆధునీకరణకు టెండర్ ప్రక్రియ చేపట్టి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు పనులు ప్రారంభించలేదన్నారు. పబ్లిసిటీ మీద ఉన్న చిత్తశుద్ధి ప్రాజెక్టు నిర్మాణ పనుల మీద లేదని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి