అనిల్‌కు ‘గిన్నిస్‌బుక్’లో చోటు

కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లాకు చెందిన రోలార్ స్కేటింగ్ సీనియర్ క్రీడాకారుడు, కోచ్ గట్టు అనిల్ కుమార్ స్కేటింగ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. కర్ణాటకలోని బెల్గంలో గత ఏడాది అక్టోబర్ 30నుంచి నవంబర్ 3వరకు జరిగిన లాంగెస్ట్ కాంగో లైన్ ఆన్ స్కేటింగ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో పాల్గొని ప్రతిభచూపాడు. లాంగెస్ట్ కాంగో స్కేటింగ్ కాంపిటేషన్‌లో 48గంటలు స్కేటింగ్ చేశారు. సోమవారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు అనిల్‌కు సర్టిఫికెట్, మెడల్ పంపించారు. అనిల్‌ను మంగళవారం జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి కీర్తి రాజవీరు అభినందించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి