శరీరంపై పచ్చబొట్టు; స్పందించిన కేటీఆర్

సాక్షి, హైదరాబాద్ : రాజకీయాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..కేసీఆర్ వారసుడిగా అభిమానుల్లో తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నారు కేటీఆర్. సమయం చిక్కినప్పుడల్లా ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ప్రజా సమస్యలపై స్పందిస్తుంటారు. అందుకే యంగ్ లీడర్ కేటీఆర్‌కు ప్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా ఓ వ్యక్తి కేటీఆర్ మీద తనకున్న అభిమానాన్ని భిన్నంగా తెలియజేశాడు. కేటీఆర్‌కు వీరాభిమాని అంటూ ఆయన బొమ్మను ఏకంగా శరీరంపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు. ‘యంగ్ డైనమిక్ లీడర్.. జై రామ్ అన్న’ అంటూ రవి కిరణ్ అనే వ్యక్తి వీపుపై పచ్చబొట్టు వేసుకున్నాడు. అనంతరం దీన్ని ఫోటో తీసీ ట్విట్టర్లో పోస్ట్ చేసి కేటీఆర్‌ను ట్యాగ్ చేశాడు. (తల్లిని కన్న తనయుడికి శుభాకాంక్షలు: కేటీఆర్)
ఇంకేముంది ఇది కాస్తా కేటీఆర్ వరకు చేరడంతో ఆయన దీనిపై ఆయన స్పందించారు. పచ్చబొట్టుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఇలాంటివి అస్సలు ప్రొత్సహించనంటూ స్పష్టం చేశారు. ‘ఇది నిజమా.. క్షమించు బ్రదర్ నేను ఇలాంటి వాటికి మద్దతివ్వను. అలాగే ప్రోత్సహించను. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మంచిది కాదు.’ అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన నెటిజన్లు మాత్రం భిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ అభిమానులు ‘జై కేటీఆర్’ అంటూ మద్దతు తెలుపుతూంటే.. ‘ప్రేమను వ్యక్త పరిచే మార్గాలు అనేకం ఉన్నాయి. అంత ప్రేమ ఉంటే మొక్కలు నాటండి. అందరికి మేలు చేస్తుంది’ అంటూ హితవు పలుకుతున్నారు.
Is that for real!!!! 😐 Sorry brother but I don’t support or endorse these. It’s absolutely unhealthy and disturbing 🙏 https://t.co/JlS7pqE7NO
— KTR (@KTRTRS) February 24, 2020
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి