లాక్‌డౌన్‌: ఆదిలాబాద్‌లో వైన్‌షాప్‌ లూటీ

Lockdown: Liquor Shop Looted In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని టానిక్‌ వైన్స్‌లో లూటీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం వైన్స్‌ పైన రేకులు తొలగించి చొరబడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లాక్‌డైన్‌ అమలువుతున్న సమయంలో ఎన్నో రోజులుగా మూసి ఉన్న వైన్స్‌లో డబ్బులు ఉండే పరిస్థితి లేదని తెలిపారు. ఈ ఘటన కేవలం మద్యం బాలిళ్ల కోసం జరిగిందా..  ఇతర కారణాలు ఎమైనా ఉన్నాయా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.  

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఇటీవలే ఆదిలాబాద్‌లోని కంటైన్‌మెంట్‌ ప్రాంతంలో మద్యం బాటిళ్లు పట్టుబడటంతో ఎక్సైజ్‌ అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా, నాటుసారా మళ్లీ గుప్పుమంటుంది. దీంతో ఎక్సైజ్‌ అధికారులు నాటుసారా, గుడుంబా తయారు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top