ఘణపురంలో మావోయిస్టుల కరపత్రాలు

Maoist Pamphlets Found In Ghanapuram - Sakshi

సాక్షి, ములుగు: జిల్లాలోని వాజేడు మండలం ఘణపురం గ్రామ శివారులో గురువారం మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఈ నెల 21 నుంచి నవంబర్ 8 వరకు మావోయిస్టుల 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మావోలు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కరపత్రాలు సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో వెలిశాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top