కాలినడకన వందల కిలోమీటర్లు

Migrant Workers Walking Hundreds of Kilometers in Summer Heat - Sakshi

వడదెబ్బ బారిన పడుతున్న వలస కూలీలు

జాతీయ రహదారి వెంట నడక

మహారాష్ట్ర సరి«హద్దుల వద్ద అడ్డగింత

ఇచ్చోడ(బోథ్‌): బతుకుదెరువు కోసం వచ్చిన వల స కూలీలు వడదెబ్బ బారిన పడుతున్నారు. పని లేక ఇక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నా రు. చిన్నారుల ఎండలకు అల్లాడిపోతున్నాయి. మండే ఎండల్లో తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు వందల కిలో మీటర్లు నడుస్తూ ప్రయాణం సాగిస్తున్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించి 25 రోజుల అవుతున్నా.. ప్రతిరోజు జాతీయ రహదారి వెంట వందలాది కూలీలు రాత్రి, పగలు తేడా లేకుండా కాలినడకన ప్రయాణం చేస్తునే ఉన్నారు.

25 రోజులుగా ప్రయాణం..
కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించింది. ఆ మరుసటి రోజే లాక్‌డౌన్‌ విధించడంతో హైదారాబాద్, వరంగల్‌కు పని కోసం వచ్చిన వలస కూలీలు పనులు లేక తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో 44వ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్, వరంగల్, బెంగుళూర్‌ వంటి ప్రాంతాల్లో ఉంటున్న వారు ఆదిలాబాద్‌ జిల్లా అంతరాష్ట్ర సరిహద్దు నుంచి గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వైపు వలస కూలీలు కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించి 25 రోజుల గడుస్తున్నా..  వందల మంది కూలీలు ప్రయాణం సాగిస్తున్నారు.

అనుమతించని మహారాష్ట్ర పోలీసులు..
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటితే కాని గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. కాని మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో తెలంగాణ అధికారులు వారిని సరిహద్దులు దాట నివ్వడం లేదు. దీంతో మహారాష్ట్ర సరిహద్దులలో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వలసకూలీలను అనుమతించడం లేదు. అటవీ మార్గం గుండా తెలంగాణ సరిహద్దులు దాటుతున్నారు. రోజుల తరబడి నడిచి ఎలాగైన తమ సొంత ఊర్లకు చేరుకుంటామని ఆశతో ప్రయాణం సాగిస్తున్నారు.

రోడ్ల పక్కనే తల దాచుకుంటూ..
మహారాష్ట్ర సరిహద్దుల వద్ద కూలీలకు అనుమతించక పోవడంతో నాలుగైదు రోజుల నుంచి వలస కూలీలు రోడ్డు పక్కనే చెట్లు, బస్‌షెల్టర్ల వద్ద తల దాచు కుంటున్నారు. తమ సొంత గ్రామాలకు ఎలాగైన చేరుకోవాలనే లక్ష్యంతో వందల కిలోమీటర్లు నడున్నారు. కాని అధికారులు సరిహద్దు దాటుతున్న వారిని గుర్తించి మళ్లీ మహారాష్ట్ర సరిహద్దులలో వదిలేస్తున్నారు. దీంతో ఇక్కడే ఉండడం మంచిదని పడిగాపులు పడుతున్నారు. రాహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు ఆపన్న హస్తం అందిస్తున్నారు. రోజుల తరబడి నడిచే వారికి అన్నం, పండ్లు పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా నగదు సహాయం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top