అప్పుడు.. ఇప్పుడు.. ప్రజాసేవకే!

Mulugu MLA Seethakka Service To The Poor People In Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్‌ సీతక్క సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఆమె ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘మీ ఎట్‌ 20’పేరిట ట్విట్టర్‌ తదితర సోషల్‌ మీడియాలో నడుస్తోన్న చాలెంజ్‌లో ఆమె కూడా పాల్గొన్నారు. 20 ఏళ్లు దాటినవారంతా ఇందులో పాల్గొనవచ్చు. తాము 20వ పడిలో ఎలా ఉన్నామో తెలుపుతూ ఓ చిత్రాన్ని పోస్టు చేయాలి. ఇప్పుడు ఈ చాలెంజ్‌ ట్రెండింగ్‌గా మారింది. ఎమ్మెల్యే సీతక్క రాజకీయాల్లోకి రాకముందు మావోయిస్టుగా పనిచేసిన సంగతి తెలిసిందే.

ఈ చాలెంజ్‌లో భాగంగా తాను 20 ఏళ్ల వయసులో తుపాకీ పట్టి అడవిబాట పట్టి ప్రజల కోసం పోరాడారు. అప్పుడు తీయించుకున్న ఫొటోను మీ ఎట్‌ 20 చాలెంజ్‌లో భాగంగా ఆమె పోస్టు చేశారు. తాను గన్‌ (మావోయిస్టుగా)తో ఉన్నా.. గన్‌మెన్‌తో ఉన్నా (ఎమ్మెల్యేగా ఉన్నా..) పేదల కూడు, గూడు, గుడ్డ కోసమేనంటూ రాసిన ఓ వ్యాఖ్య కూడా పలువురిని ఆకట్టుకుంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top