ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి చేదు అనుభవం

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్న సిబ్బంది
సాక్షి, యాదాద్రి : చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. టోల్ ఫీజు చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకుంది. తాను ఎమ్మెల్సీ అని చెప్పినా అనుమతించలేదు. చివరికి ఐడీ కార్డు చూపించినా వదల్లేదు. మొదట గన్‌మెన్ లేకపోవడంతో ఎమ్మెల్సీ అని అనుకోలేదని చెప్పిన సిబ్బంది.. తర్వాత టోల్ మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాహనాన్ని అనుమతించారు. కాగా, టోల్ ప్లాజా సిబ్బంది తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ధర్నాకు దిగారు. ఏ ఎమ్మెల్సీని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో చెప్పాలంటూ టోల్ ఫ్లాజా వద్ద బైఠాయించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి