ఇక ఇంటికే  ఈ– చలాన్‌ 

Police department Introduce New Policy For Drunk And Drive Cases  - Sakshi

సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్‌) : నిబంధనలకు నీళ్లుదులుతూ ఇష్టారాజ్యంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారుల నుంచి పోలీసులు నేరుగా జరిమానా వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలికారు. నూతన విధానంతో నేరుగా ఈ చలాన్‌ ఇంటికి పంపించి జరిమానను మీసేవలో కట్టిస్తున్నారు. ఈ చలాన్‌ విధానంతో ట్రాఫిక్‌ నియంత్రణ సులువు అవుతుంది.రోడ్లపై ఇష్టానూసారంగా ప్రయాణించి పోలీసు వద్ద ఉన్న కెమెరాలకు  చిక్కితే వారం రోజుల్లో నేరుగా ఈ చలాన్‌ ఇంటికి వస్తుంది. ఆర్‌ సర్వర్‌ అనుసంధానం చేసిన పోలీస్‌ అప్లికేషన్‌ సిబ్బంది తీసిన వాహనం ఫోటోను ఆప్‌లోడ్‌ చేయగానే వాహనదారుడి వివరాలన్ని డిస్‌ప్లే అవుతాయి. అనంతరం వారం రోజుల్లో ఈ చలాన్‌ నిబంధనలు ఆతిక్రమించిన వాహనదారుడి ఇంటికి ఈ –చలాన్‌ వెళ్తుంది.ఫలితంగా జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. 

పెరుగుతున్న హెల్మెట్‌ వాడకం.
ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్‌ ధరించకపోవడంతోనే ప్రాణ నష్టం జరుగుతుంది. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన పలువురు హెల్మెట్‌ ధరించక చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనలు చాల ఉన్నాయి. పోలీసులు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గతంలో అనేక సార్లు రోడ్డు భద్రత–హెల్మెట్‌ వాడకంపై అవగహన కార్యక్రమాలు నిర్వహించిన పెద్దగా వాహనదారుల్లో మార్పు రాలేదు, అయితే గత నెల రోజుల నుంచి ఈ చలాన్‌ విధానంపై ప్రజలకు అవగహన కల్పించి నిబంధనలు పాటించని వాహనదారులకు ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా పోలీసులు తమకు కేటాయించిన ట్యాబ్‌ల ద్వారా సదరు వాహనం దారుడికి ఈ–చలాన్‌ విధిస్తున్నారు.

నేరుగా ఇంటికి జరిమాన వస్తుండడంతో తప్పిని సరిగా జరిమాన కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో భద్రతతో పాటు ఫైన్‌ నుంచి తప్పించుకోవడం కోసం హెల్మెట్‌ వాడకంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, వాహనాల ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్‌ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని గ్రహించిన వాహనదారులు స్వచ్చందగానే హెల్మెట్‌ వాడుతున్నారు.కాగ గ్రామంలో పోలాల వద్దకు పోయే సందర్భాలలో ఫైన్‌లు విధించవద్దని వాహనదారులు కొరుతున్నారు. 

మద్యం తాగి నడిపితే ఇక ‘అంతే’ 
హెల్మెట్‌ వాడకంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తుడడంతో మందు బాబాలు బెంబేలెత్తిపోతున్నారు.మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే భారీగా జరిమానతో పాటు కొన్ని సందర్భాలలో కోర్టులు జైల్‌ శిక్ష విధిస్తున్నాయి.దీంతో వాహనదారుల్లో క్రమేపి మార్పు వస్తుందని పోలీసులు చేప్తున్నారు. వాహనాదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలతో పాటు జరిమానల బారి నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.

ప్రజల రక్షణ కోసమే నిబంధనలు... 
ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలి.రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి.ప్రమాదాలు నివారించేందుకే కృషి చేస్తున్నాం.ప్రజలు భారంగా బావించద్దు.మైనర్లకు సైతం వాహనాలు ఇవ్వద్దు.మైనర్ల వాహనాలు ఇవ్వడం ద్వారా ప్రమాదాలను కొనితెచ్చుకున్నవారు అవుతారు.పోలీసులకు ప్రజలు సహకరించాలి.     –రాజు ఎస్‌ఐ రామారెడ్డి

హెల్మెట్‌ వాడకంఎంతో మేలు 
ద్విచక్రవాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్‌ వాడాలి.దీని వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకు రక్షణగా కల్పిస్తుంది.ఊరిలో మాత్రం మినహాయింపు ఇవ్వాలి.
–తుపాకుల రాజేందర్‌గౌడ్,రామారెడ్డి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top