రేవ్‌ పార్టీ : ‘యువతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చాం’

Pub Management Should Be Responsible For All Says West Zone DCP - Sakshi

వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌

సాక్షి, హైదరాబాద్‌ : తమ జోన్‌ పరిధిలో హుక్కాపై ఉక్కుపాదం మోపామని వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏర్‌ శ్రీనివాస్‌ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 2019లో హుక్కా పూర్తిగా అరికట్టామని చెప్పారు. ఇటీవల తాము తీసుకున్న చర్యలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఈ నెల 12 తేదీన ది సీక్రెట్ ఎఫైర్‌ పబ్‌లో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు వెళ్లి దాడులు చేశారు. కొందరు పరారయ్యారు. 21 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారించి బాదితులుగా పేర్కొని కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాం. సిగ్నోవా కంపెనీకి చెందిన వారే రేవ్ పార్టీ నిర్వయించడానికి ప్లాన్ చేశారు. వ్యాపారాలు పెంచుకోవడం, సిగ్నోవా కస్టమర్లను ఆనందపరచడం కోసమే ఈ రేవ్‌ పార్టీ జరిగింది. 
(చదవండి : జూబ్లీహిల్స్‌ రేవ్‌పార్టీలో కొత్త ట్విస్ట్‌)

ఈ రేవ్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ మొని, బుర్రి ప్రసాద్ గౌడ్‌ను అరెస్ట్ చేశాం. ఎఫైర్‌ పబ్ యజమాని సంతోష్ రెడ్డి, మేనేజర్ భరత్ పరారీలో ఉన్నారు. వారికోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. బేగంపేట్‌లోని లిస్బన్ పబ్‌పై కూడా చర్యలు తీసుకుంటాం. ఎఫైర్ పబ్‌పై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు లేక రాశాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. పబ్‌లో ఏం జరిగినా యజమానులే బాధ్యత వహించాలి, పబ్‌లలో బౌనర్లు వ్యవహరించే తీరుపై కూడా నిఘా ఉంది. వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం’అని పేర్కొన్నారు.
(చదవండి : పబ్‌లో అశ్లీల నృత్యాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top