మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రంలో అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగించాలని, కేంద్రం సూచించిన సడలింపులను రాష్ట్రంలోఅమలు చేయరాదని మంత్రివర్గం నిర్ణయించింది. వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ జోన్లకు సంబంధించిన 14 రోజుల తప్పనిసరి ఐసోలేషన్ గడువు మే 7తో ముగియనుండటంతో ఆ మేరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముఖ్యాంశాలివీ..
♦ కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర వస్తువులు/సేవల రవాణాకు మాత్రమే అనుమతి
♦ సామూహిక ప్రార్థనల్లో పాల్గొనకుండా ప్రార్థన స్థలాలు మూసివేత
♦ ఈ–కామర్స్, యాప్ ఆధారిత, ఆన్‌లైన్ కంపెనీలు.. ఆహారాన్ని డెలివరీ చేయరాదు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి