స్మార్ట్‌ పోలీసింగ్‌లో తెలంగాణకు పురస్కారం 

Telangana police bags FICCI Special jury Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్మార్ట్‌ పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసు విభాగం ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) స్పెషల్‌ జ్యూరీ అవార్డు గెలుచుకుంది. డయల్‌ 100 ఫోన్‌కాల్స్‌ విభాగంలో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించినందుకు ఫిక్కీ ఈ అవార్డు అందజేసింది. దేశంలో స్మార్ట్‌ పోలీసింగ్‌ ద్వారా ప్రజల రక్షణ, భద్రతా విషయాల్లో మెరుగైన సేవలు అందించిన వారి కోసం ఈ అవార్డు అందిస్తారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ చేతుల మీదుగా న్యూఢిలీలో శుక్రవారం అడిషనల్‌ డీజీ (టెక్నికల్‌ సర్వీసెస్‌) రవి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డయల్‌100, టెక్నాలజీ టీమ్స్, పాట్రోల్‌ కార్స్, బ్లూకోల్ట్స్‌ అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top