అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్‌

AP CM YS Jagan Stops Convoy Allows Ambulance To Move - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్‌.. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. ఈ క్రమంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు. కాగా ఉయ్యూరు నుంచి గన్నవరం వైపు బైక్‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషా రామ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. బాధితుడిని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.(చదవండి: మహానేతకు కుటుంబసభ్యుల నివాళులు)

చదవండి: అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top