ఏపీలో ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కరోనా క్లిష్ట సమయంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ స్కూల్ విధానంలో చదువుతున్న టెన్త్, ఇంటర్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 1.68 లక్షల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాస్ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపెన్ స్కూల్ విద్యార్థులను పైరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి