పెరుగుతున్న రికవరీ రేటు

Coronavirus: 10392 Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 76.47 శాతానికి చేరింది. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దూకుడు కొనసాగిస్తోంది. రోజుకు సగటున 60 వేలకు పైగా టెస్టులు చేస్తున్నారు. బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 38,43,550కి చేరింది. గడిచిన 24 గంటల్లో 60,804 పరీక్షలు చేశారు. 10,392 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. గడచిన 24 గంటల్లో 72 మంది కోవిడ్‌ కారణంగా మృతి చెందారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజులో 8,454 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,55,531కి చేరగా, 3,48,330 మంది కోలుకున్నారు. మరో 1,03,076 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ మృతుల సంఖ్య 4,125కు చేరింది. రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు 71,977 టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్‌ గణాంకాలు వెల్లడించాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top