తేనెటీగల దాడిలో శ్రీశైలం డీఈ మృతి

Honey Bees Attack Srisailam Project Divisional Engineer Last Breath - Sakshi

సాక్షి, కర్నూలు: శ్రీశైలం రిజర్వాయర్‌ వద్ద మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్ కెనాల్ డివిజనల్ ఇంజనీర్ భానుప్రకాశ్‌ మృతి చెందారు. కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్‌ వద్ద విధుల్లో ఉండగా ఆయనపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది. పెద్ద ఎత్తున తేనెటీగలు దాడి చేయడంతో భానుప్రకాశ్‌ ప్రాణాలు విడిచారు. ఇదిలాఉండగా.. గత నెలలో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 9 మంది ఉద్యోగులు మరణించిన సంగతి తెలిసిందే. 
(చదవండి: విషాదం: లోపలున్న 9 మందీ మృతి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top