వాట్సాప్‌ గ్రూప్‌లో రూ.లక్ష పలికిన లడ్డూ పాట

Laddu Auction Was Came Above 1Lakh Rupees in Whatsapp Group - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : నగరంలో మొండేటివీధి శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో వినాయకచవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీగణపతి ఆలయ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ పాటలో నగరానికి చెందిన ఎన్‌.కిరణ్, కె.గోవింద్, అమరావతి శ్రీను, ఎస్‌.శ్రీను, జె.నవీన్‌లు సంయుక్తంగా రూ.1.03 లక్షలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.  ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఆలయం వద్ద స్వామివారి లడ్డూ ప్రసాదానికి అర్చకులు బద్రం కోదండరామాచార్యులు, బద్రం మాధవాచార్యులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి సమక్షంలో మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top