‘రైతుల కోసమే సీఎం జగన్‌ నిర్ణయం’

Mekapati Goutham Reddy: YS Jagan Support To Central Bill For Farmers - Sakshi

సాక్షి, నెల్లూరు : రైతుల ప్రయోజనం కోసమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. నెల్లూరులో రైతులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాయింట్ కలెక్టర్‌ను నోడల్ అధికారిగా నియమించి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. జిల్లాలోని గోదాములలోని బియ్యాన్ని ఇతర జిల్లాలకు పంపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు గడువును పెంచేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృషి చేశారని, కేంద్ర బృందం పర్యటన తర్వాత పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. (ఇకపై జిల్లాకు మరింత దగ్గరగా..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top