నందిగామ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

MLA Mondithoka Jaganmohan Rao Tests Positive For Covid 19 - Sakshi

సాక్షి, నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. నందిగామ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన తెలిపారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే కోరారు. చికిత్స తీసుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని, కలవటానికి ప్రయత్నించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top