ఆర్‌ అండ్‌ బీ టెండర్లపై అపోహలొద్దు

R and B Chief Secretary Krishnababu Comments On Tenders - Sakshi

‘జ్యుడిషియల్‌ ప్రివ్యూ’ తర్వాత కూడా 

ఆధారాల్లేకుండా వార్తలు ప్రచురిస్తే చర్యలు 

ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు

సాక్షి, అమరావతి: రహదారులు, భవనాల శాఖ టెండర్లను సాంకేతిక మదింపు కమిటీ అనుమతించి, ఫైనాన్స్‌ బిడ్లు తెరిచాక ఏ ఫిర్యాదులొచ్చినా, అనుమానాలున్నా చర్యలు తీసుకుంటామని ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న రహదారులు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్‌ డాక్యుమెంట్లను జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించాక ఆధారాల్లేకుండా వార్తలు ప్రచురిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ప్రభుత్వంపై అపోహలు కలిగేలా వార్తలు రాస్తున్నాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.. 

► ఆర్‌అండ్‌బీ టెండర్లను డివిజన్ల వారీగా చేపట్టేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌కు, రుణం అందిస్తున్న ఎన్‌డీబీకి ప్రతిపాదనలు పంపాం. ఇందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్, ఎన్‌డీబీ అంగీకరించలేదు. జిల్లాల వారీగా ప్యాకేజీలుగా అనుమతిస్తే సులభంగా ఉంటుందని భావించాయి.  
► ఏపీ, తెలంగాణ రవాణా ముఖ్య కార్యదర్శులు మంగళవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యి అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చిస్తారు. ఒప్పందం ఆలస్యమవుతున్నందున 72 వేల కి.మీ బస్సులు తిప్పేందుకు ప్రతిపాదించాం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top