ఆ విషయం స్వయంగా ప్రధానే చెప్పారు

RK Roja Slams Chandrababu Naidu Over Amaravati Land Scam - Sakshi

సాక్షి, తిరుపతి: అమరావతి కుంభకోణం మీద ఏసీబీ కేసు నమోదు చేస్తే చంద్రబాబు, ఆయన బినామీలు గజగజ వణుకుతున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'అమరావతిలో భారీ కుంభకోణం జరగింది. రాజధాని పేరుతో బాబు, ఆయన బినామీలు వేల ఎకరాలు కొనుగోలు చేశారు. టీడీపీ పాలనలో పెద్ద కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం మీద ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తే గజగజ వణుకుతున్నారు.

ఓ లాయర్ మీద కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం బాధాకరం. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నేషనల్ మీడియాతో పాటు మేధావులు హైకోర్టు ఉత్తర్వుల మీద విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగా ప్రధాని చెప్పారు. పోలవరంను ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం తేలుకుట్టిన దొంగలా ఉన్నారు. ('మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం')

దమ్ముంటే ఇప్పుడు చంద్రబాబు అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అక్రమాల మీద సీబీఐ విచారణ కోరాలి. అంతర్వేది ఘటనలో ప్రభుత్వం తప్పు లేకపోయినా సీఎం జగన్ సీబీఐ విచారణ కోరారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడి మీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణకు ఆదేశించారు. నా కొడుకు జగన్ తప్పు చేసి ఉంటే ఉరి తీయండని అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్‌ చెప్పారు. చంద్రబాబు స్టేలతో బతుకుతున్న వ్యక్తి. కోర్టులు కూడా అందరికి ఒకే న్యాయం లా చూడాలని కోరుతున్న' అంటూ ఆర్కే రోజా పేర్కొన్నారు. (సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top