సృష్టి ఆసుపత్రి కేసు:. డాక్టర్ నమ్రతకు నోటీసులు

Srushti Hospital Case: AP Medical Council Sends Notices To Dr Namratha - Sakshi

సాక్షి, విజయవాడ: సృష్టి ఆసుపత్రి అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ విచారణను వేగవంతం చేసింది. ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులను విక్రయించారనే  ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా డాక్టర్ నమ్రత అక్రమాలపై ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతకు నోటీసులు జారీ చేసింది. సరోగసి చిన్నారుల అక్రమ విక్రయంపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించిన మెడికల్ కౌన్సిల్.. బినామీ పేర్లతో డాక్టర్ నమ్రత ఐవీఎఫ్‌ హాస్పిటల్స్ నిర్వహించినట్లు నిర్ధారించింది. నమ్రతపై చర్యలపై ఎథిక్స్ కమిటీకి ఏపీ మెడికల్ కౌన్సిల్ సిఫార్సు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top