అభివృద్ధికి టీడీపీ సహకరించాలి

విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే మూడు రాజధానులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని తెలిపారు. (చదవండి: ‘కన్నవారికి తలకొరివి పెట్టని ఆయన హిందువా?’)
సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని విమర్శలు గుప్పించారు. కోర్టులకు వెళ్లి సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వారు చేసిన అవినీతిపై కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకుని అభివృద్ధికి సహకరించాలని, అభివృద్ధికి అడ్డం పడితే టీడీపీ నేతలకు పుట్టగతులు ఉండవని వంశీ కృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి